తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు - AP High Court Latest News

హైకోర్టు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, మద్రాస్​ హైకోర్టులో పనిచేస్తోన్న జడ్జిలను వివిధ హైకోర్టులకు బదిలీ చేయడానికి కొలీజియం సిఫారసు చేసింది.

Supreme Court
Supreme Court

By

Published : Nov 24, 2022, 8:17 PM IST

Updated : Nov 24, 2022, 9:05 PM IST

Supreme Court collegium: హైకోర్టు జడ్జిల బదిలీకి సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు జడ్జిగా పనిచేస్తోన్న జస్టిస్‌ లలితను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. హైకోర్టులో పనిచేస్తోన్న మరో జడ్జి జస్టిస్‌ నాగార్జున్‌ను మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసిన కొలీజియం.. జడ్జి జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది.

ఏపీ హైకోర్టులో జడ్జిగా విధులు నిర్వహిస్తోన్న జస్టిస్‌ దేవానంద్‌ను మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసిన కొలీజియం.. ఇదే హైకోర్టులో సేవలు అందిస్తోన్న జస్టిస్‌ రమేష్‌ను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. అంతే కాకుండా మద్రాస్​ హైకోర్టులో జడ్జిగా విధులు నిర్వహిస్తోన్న జస్టిస్‌ రాజాను రాజస్థాన్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. ఇదే న్యాయస్థానంలో పనిచేస్తోన్న మరో జడ్జి జస్టిస్‌ వేలుమణిని కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 24, 2022, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details