తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు తిరుమలకు సుప్రీం కోర్టు సీజే.. పటిష్ఠ ఏర్పాట్లు చేసిన తితిదే - cji justice nv ramana on lord balaji darshan

నేడు భారత ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా తిరుమలకు రానున్నారు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు తితిదే అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

cji justice nv ramana
తిరుమలకు సుప్రీం కోర్టు సీజే

By

Published : Jun 10, 2021, 6:56 AM IST

శ్రీవారి దర్శనార్థం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుమలకు రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం చెన్నైకి చేరుకుని.. అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. రాత్రి తిరుమల కొండపైనే బస చేసి.. శుక్రవారం ఉదయం సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొననున్నారు.

ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా ఏప్రిల్ 11న (శుక్రవారం) స్వామివారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీజేఐ హోదాలో తిరుమలకు వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి.. తితిదేకు పర్యటన వివరాలు అందాయి. ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి.

ఇదీ చూడండి: హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరుగుదల!

ABOUT THE AUTHOR

...view details