తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికపై సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో, డిస్కమ్‌లు, ఏపీ ఉద్యోగులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫున ముకుల్ రోహత్గీ, వి.గిరి, రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. విభజన వివాదంలో లేని 584 మందిని రాష్ట్రానికి కేటాయించడంపై తెలంగాణ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్మాధికారి కమిటీ పరిధి దాటి కేటాయింపులు జరిపిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివాదంలో లేని ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడం సరికాదని వాదనలు వినిపించారు.