తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టికల్ 32 పరిధిని తగ్గించాలి అనుకుంటున్నారా?: సుప్రీం - సుప్రీం కోర్టు వార్తలు

చెవేళ్ల లోక్​సభ 2019 ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ వేసినా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణను త్వరగా ముగించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అభ్యర్థించాలని సూచించింది.

suprem court hearing former mp konda vishweshwar reddy petition on 2019 chevella lok sabha elections
ఆర్టికల్ 32 పరిధిని తగ్గించాలనుకుంటున్నారా: సుప్రీం

By

Published : Nov 17, 2020, 7:36 PM IST

ఆర్టికల్ 32 ప్రకారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాడాన్ని సీజేఐ బోబ్డే తప్పుబట్టారు. ఆర్టికల్ 32 పరిధిని తగ్గించాలనుకుంటున్నట్లు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెవేళ్ల లోక్​సభ 2019 ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ వేసినా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్​పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు విచారణను త్వరగా ముగించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అభ్యర్థించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మీనాక్షి అరోరాకు సీజేఐ సూచించారు. హైకోర్టు సీజేకి దరఖాస్తు చేసుకునేందుకు పిటిషనర్​కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచన మేరకు న్యాయవాది పిటిషన్​ను ఉపసంహరించుకున్నారు.

ఇదీ చదవండి:ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదిక కొట్టివేయండి: తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details