హైదరాబాద్ బోరబండలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ప్రసాద్ గుప్తా ఆధ్వర్యంలో సుమారు 700 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. వారి చదువుకు కావలసిన సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
'పేద విద్యార్థులకు ఆపన్నహస్తం అందించాలి' - latest news of poor students
ప్రతిఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ప్రసాద్ గుప్తా కోరారు. పేద విద్యార్థులకు అండగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ బోరబండలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దుప్పట్లు, పుస్తకాలను పంపిణీ చేశారు.
సేవా దృక్పథంతో పేద విద్యార్థులను ఆదుకోండి
తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాలతోపాటు దుప్పట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: "సమ్మె చట్ట విరుద్ధం.. విధుల్లో చేరినా కొనసాగింపు కష్టమే..."