కోల్‌కత్తా కేంద్రంగా వృద్ధుల ఆత్మగౌరవ జీవనం కోసం పని చేస్తున్న సపోర్ట్ ఎల్డర్స్ ఫ్యామిలీ సంస్థ ద్వితీయ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. సీనియర్ సిటిజన్ల అవసరాలు తగిన విధంగా 24 గంటలు సేవల అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అప్రాతిమ్ చటోపాధ్యాయ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజార హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సపోర్ట్ ఎల్డర్స్ చేస్తున్న సేవలను ఆమె వివరించారు.
హైదరాబాద్‌లో సపోర్ట్ ఎల్డర్స్ సంస్థ సేవలు ప్రారంభం - తెలంగాణ వార్తలు
కోల్‌కత్తా కేంద్రంగా పనిచేసే సపోర్ట్ ఎల్డర్స్ ఫ్యామిలీ సంస్థ మరో కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. వృద్ధులకు అత్యంత వేగవంతంగా సేవలను అందించడమే తమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకురాలు అన్నారు. ఒక రిమోట్ ద్వారా అన్ని రకాలైన సేవలను 24 గంటలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికత, పూర్తి అంకితభావంతో తమ బృందం వృద్ధులకు సేవలందిస్తోందని ఆమె చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా వైద్య, ఫుడ్ డెలివరీ, మెడిసిన్ వంటి సేవలను వినియోగదారులకు ప్రత్యేక సాంకేతికత ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఒక రిమోట్ ద్వారా అన్ని రకాలైన సేవలను 24 గంటలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కోల్‌కత్తాలో 1400 మందికి సంస్థ సేవలందిస్తోందని అన్నారు. అత్యంత వేగవంతంగా వైద్య సేవలను అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు.
ఇదీ చదవండి:నిబంధనలు గాలికొదిలేశారు... వైరస్‌ను ఆపలేకపోతున్నారు