తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆక్సిజన్ ఏజెన్సీ నుంచి ఆస్పత్రులకు సిలిండర్లు సరఫరా - తెలంగాణ వార్తలు

కొవిడ్ వేళ ఆక్సిజన్​ సిలిండర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కరోనా బాధితులు ఊపిరి ఆడక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సిలిండర్ల వినియోగం పెరిగింది. చర్లపల్లిలోని ఓ ప్రైవేటు ఏజెన్సీ నుంచి స్థానిక ఆస్పత్రులకు ప్రాణవాయువు నింపిన సిలిండర్లు సరఫరా చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

Supply of oxygen cylinders,  hyderabad hospitals
ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా, హైదరాబాద్​లో ఆక్సిజన్ సరఫరా

By

Published : Apr 27, 2021, 10:33 AM IST

కరోనా బాధితుల కోసం హైదరాబాద్ చర్లపల్లిలోని శివనందా రోల్స్ ప్రైవేట్ ఆక్సిజన్ ఏజెన్సీ నుంచి స్థానిక ఆస్పత్రులకు సిలిండర్లు చేరవేస్తున్నారు. సిలిండర్​లోకి లోడ్ చేసి రెడీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతానికి ఎలాంటి కంపెనీలకు ఇవ్వకుండా.. పూర్తిస్థాయిలో ఆస్పత్రులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు వచ్చాయని వెల్లడించారు. దీనిపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని అన్నారు.

ఇదీ చదవండి:వాతావరణ మార్పులతో ముసురుతున్న ముప్పు!

ABOUT THE AUTHOR

...view details