తెలంగాణ

telangana

ETV Bharat / state

వివేకా హత్య కేసు.. బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన సునీల్ యాదవ్ - హైకోర్టును ఆశ్రయించిన సునీల్ యాదవ్

Sunil Yadav Bail Petition: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా నిందితులను కడప నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ కేసులో భాగంగా నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్యకేసు హైదరాబాద్‌కు బదిలీ కావడంతో తాజాగా తెలంగాణ హైకోర్టులో సునీల్ బెయిల్ పిటిషన్ వేశాడు.

Sunil Yadav Bail Petition
Sunil Yadav Bail Petition

By

Published : Feb 13, 2023, 10:39 PM IST

Sunil Yadav Bail Petition: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీలోని పులివెందులకు చెందిన సునీల్ యాదవ్​ను 2021 ఆగస్టులో సీబీఐ అరెస్టు చేసింది. కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌పై 2021 అక్టోబరులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. గతంలో సునీల్ యాదవ్​కు కడప జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది.

వివేకా హత్యకేసు హైదరాబాద్‌కు బదిలీ కావడంతో తాజాగా తెలంగాణ హైకోర్టులో సునీల్ బెయిల్ పిటిషన్ వేశాడు. సునీల్ యాదవ్ ప్రస్తుతం చంచల్ గూడ జైళ్లో ఉన్నారు. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16న హైకోర్టులో విచారణ జరగనుంది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా నిందితులను కడప నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. నిందితులు సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరుపరచగా.. ఉమాశంకర్‌రెడ్డి వాహనం ట్రాఫిక్‌లో ఆగిపోయినందున మిగిలిన నిందితులను తొలుత కోర్టులో హాజరుపరచలేకపోయారు.

అప్పుడు అతడు వచ్చేవరకు విచారణను సీబీఐ కోర్టు కాసేపు వాయిదా వేసి ఉమాశంకర్‌రెడ్డి వచ్చిన తర్వాత న్యాయస్థానం.. విచారణ ప్రారంభించిన విషయం విదితమే.. తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసి నిందితుల్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించగా ప్రస్తుతం ఈ కేసులో భాగంగా నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్యకేసు హైదరాబాద్‌కు బదిలీ కావడంతో తాజాగా తెలంగాణ హైకోర్టులో సునీల్ బెయిల్ పిటిషన్ వేశాడు.

ABOUT THE AUTHOR

...view details