తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన సునీల్​ కనుగోలు విచారణ.. మరోసారి పిలుస్తామన్న సైబర్ క్రైమ్ పోలీసులు

Sunil Kanugolu Attended Cybercrime Police Investigation: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో నేడు సునీల్ కనుగోలు విచారణ ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో ఇచ్చిన నోటీసుల ఆధారంగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఇవాళ 2గంటల పాటు ప్రశ్నించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు.

Sunil Kanugolu
Sunil Kanugolu

By

Published : Jan 9, 2023, 3:11 PM IST

Sunil Kanugolu Attended Cybercrime Police Investigation: కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసుల ముందుకొచ్చారు. సుమారు 2 గంటల పాటు విచారణ సాగింది. సునీల్ నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు ఆయన రికార్డ్​ను నమోదు చేశారు. వాటిని పరిశీలించిన తరువాత మరోసారి విచారణకు పిలుస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. మరోవైపు విచారణ తరువాత మీడియాతో మాట్లాడేందుకు సునీల్ నిరాకరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో గత నెల 14న పోలీసులు.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సునీల్‌ కార్యాలయంలో సోదాలు జరిపారు. అక్కడి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు సునీల్‌ కనుగోలుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్‌ 30న విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, పిటిషన్‌ను కొట్టివేసింది.

అయితే అప్పటివరకు పోలీసులు అరెస్టు చేయవద్దని, 8న సునీల్‌ విచారణకు హాజరుకావాల్సిందేనని సూచించింది. హైకోర్టు సూచనల మేరకు నిన్న విచారణకు రావాల్సి ఉండగా, ప్రత్యేక అభ్యర్థనతో ఇవాళ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ముందుకొచ్చారు. నేతలను కించపర్చటంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటం, కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌ల్లో లభ్యమైన సమాచారం మేరకు పోలీసులు సునీల్‌ను ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details