Sunday Special Non Veg Curries :మాంసాహార ప్రియులకు ఆదివారం వచ్చిందంటే కంచంలోకి ముక్క చేరాల్సిందే. ప్రతి ఆదివారం చికెన్, మటన్, చేపలు.. ఇలా ఏదో ఒక వెరైటీ ప్రయత్నిస్తూ.. తమ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటారు. మనకు అందుబాటులో దొరికే నాన్‌వెజ్‌తో ఎప్పుడు ఒకే రకం కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ మీ కోసమే.. ఈ స్టోరీ చదివేయండి.. ఈ సండే ఫండేగా మీకు పసందైన నాన్ వెజ్ వంటకాలు రుచి చూసేయండి.
నాటుకోడి కూర..
Natu Kodi Curry :మనం తరచుగా పౌల్ట్రీచికెన్ మాంసం తింటుంటాం. ఈ ఆదివారం మాత్రం కాస్త వైరైటీ కోసం.. నాటు కోడి ట్రై చేయండి. ముందుగా కేజీ నాటు కోడి మాంసాన్ని సిద్ధం చేసుకోవాలి. చికెన్‌కు తగినంత నూనె, కారం, ఉప్పు పట్టించి కొద్దిగా నీళ్లు పోసి.. ఐదు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత లవంగాలు, ధనియాలు, యాలకులు వేయించుకున్న గసగసాలు, మిరపకాయలు, కొబ్బరిపొడి, వెల్లులి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం కడాయిలో నూనె వేసుకుని ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వాటిని గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించుకోవాలి. ఉడికించుకున్న చికెన్ కడాయిలో వేసి ఆ తర్వాత.. తయారు చేసుకున్న మసాలాను వేయాలి. నాలుగు నిమిషాల తర్వాత గరంమసాలా, ఉప్పు వేసి.. ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేయండి. ఇప్పుడిక టేస్టీ నాటుకోడి చికెన్ కర్రీ సిద్ధం అయ్యింది.
బోటీ మసాలా ఫ్రై..
Boti Masala Fry : ముందుగా కేజీ బోటీని తెచ్చుకుని మంచి నీటితో శుభ్రం చేసి.. కుక్కర్‌లో పోసుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసుకుని అందులో ఉల్లిపాయముక్కలు, షాజీరా వేసుకుని గోధుమరంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి. అనంతరం ఉడకబెట్టి ఉంచిన బోటీని కడాయిలో వేయాలి. రెండు నిమిషాలు మంటపైన వేయించుకోవాలి. అప్పుడు గరంమసాలా, మిరియాలపొడి, ధనియాలపొడి, ఉప్పు, కారం, కరివేపాకు వేసి ఐదు నిమిషాల పాటు సన్నమంట మీద ఉంచాలి. దించేటప్పుడు పుదీనా, కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.
How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!
మటన్ మసాల కర్రీ..
Mutton Masala Curry :ముందుగా కేజీ మటన్ తెచ్చుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. కొబ్బరిపొడి, గసగసాలను కొద్దిగా వేయించుకుని మిక్సీలో వేసుకుని ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె వేసి అందులో ఉల్లిపాయముక్కలు వేసుకుని గోధుమ రంగులోకి వచ్చేంతవరకూ దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి, పసుపు ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించుకోవాలి.