Case Against Book My Show For Selling Sunburn Tickets in Hyderabad:భారీ సంగీత వేడుకగా పేరుగాంచిన కార్యక్రమం సన్‌బర్న్. న్యూ ఇయర్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఈ వేడుకలో పాల్గొంటారు. అయితే హైదరాబాద్‌లో ఈ ఈవెంట్‌కు అనుమతులు రాకుండా బుక్ మై షో టికెట్లు విక్రయిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీంతో పోలీసులు బుక్‌మై షో నిర్వాహకులపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం పోలీసుల అనుమతి తప్పని సరిగా ఉండాలని గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు తప్పవని వెల్లడించారు.
సన్‌బర్న్ అనేది భారీ సంగీత వేడుక. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో మద్యం అనుమతి ఉంటుంది. ఇదే అదనుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయనే ఆరోపణలున్నాయి. ఈసారి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబరు 31వ తేదీన మాదాపూర్‌లో సన్‌బర్న్ పేరుతో ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
HyderabadSunburn Event Controversy 2023 :వాస్తవానికి ఈ వేడుకను సుమంత్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈవెంట్‌ను సన్‌బర్న్ పేరుతో నిర్వహిస్తామని, ఇందుకు కొంత మేర చెల్లిస్తానని అతడు నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఈవెంట్ నిర్వహణకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా ఇంకా ఆమోదం లభించలేదు. అయినా బుక్‌మై షోలో టిక్కెట్లు అమ్మకానికి పెట్టడంతో అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈవెంట్‌కు ఎలా అనుమతి ఇస్తారంటూ సీఎం రేవంత్ పోలీసుల్ని ప్రశ్నించారు.
CP Avinash Mohanty On Sun Burn Event : మరోవైపు దీనిపై సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి (Avinash Mohanty) స్పందించారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్‌లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని మహంతి స్పష్టం చేశారు.
సన్‌బర్న్ ఈవెంట్ అడ్డగింతకు ఎన్‌ఎస్‌యూఐ యత్నం.. అడ్డుకున్న పోలీసులు..