తెలంగాణ

telangana

ETV Bharat / state

Arasavalli Sri Suryanarayana Temple: స్వామివారిని తాకిన సూర్యకిరణాలు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి (Arasavalli Sri Suryanarayana Temple)ని సూర్య కిరణాలు తాకాయి. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల్లో స్వామిని సూర్య కిరణాలు తాకుతుంటాయి.

Arasavalli Sri Suryanarayana Temple
Arasavalli Sri Suryanarayana Temple

By

Published : Oct 1, 2021, 2:50 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి (Arasavalli Sri Suryanarayana Temple) వారిని భానుడి లేలేత కిరణాలు తాకాయి. ఉదయం తొమ్మిది నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్టును స్పృశించినట్లు ప్రధానార్చకులు తెలిపారు.

స్వామివారిని తాకిన సూర్యకిరణాలు

ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల్లో స్వామి(Arasavalli Sri Suryanarayana Temple)ని ఆదిత్యుని కిరణాలు తాకటం ఆనవాయితీ. ప్రతీయేటా మార్చి 9, 10 తేదీల్లో... తిరిగి అక్టోబర్ 1, 2 తేదీల్లో .... రవి కిరణాలు స్వామి వారిని స్పృశిస్తాయి. ఆ అద్భుత ఘట్టం ఇవాళ ఆవిష్కృతం అయింది. ఈ అపురూప దృశ్యం చూసి భక్తులు పులకించిపోయారు.

ఇదీ చదవండి :Kanipakam Laddu : కాణిపాణం గణేశుని లడ్డూ తెలంగాణకే దక్కింది!

ABOUT THE AUTHOR

...view details