తెలంగాణ

telangana

ETV Bharat / state

సభాపతి పోచారం, మంత్రి ఎర్రబెల్లికి సమన్లు - Mla vivekananda news

ప్రజాప్రతినిధుల కోర్టు పలువురు నాయకులకు సమన్లు జారీ చేసింది. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వివేకానందతో పాటు పలువురికి నోటీసులిచ్చింది.

సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డికి సమన్లు
సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డికి సమన్లు

By

Published : Feb 22, 2021, 5:02 PM IST

సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2005లో తెదేపా చేపట్టిన ఆందోళన కేసులో పోచారం సహా పలువురికి సమన్లు ఇచ్చింది. వరంగల్‌లోని సుబేదారి పరిధిలో ఆందోళనకు దిగిన కేసులో నోటీసులిచ్చింది. వరంగల్ కోర్టు నుంచి ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టుకు కేసు బదిలీ అయింది. ఎర్రబెల్లి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వేణుగోపాలాచారి, మండవ వెంకటేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డికి సమన్లు ఇచ్చింది. మార్చి 4న హాజరుకావాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కూడా ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2016లో నిర్వహించిన ఆందోళనలో వివేకానందకు నోటీసు ఇచ్చింది. వివేకానంద రాష్ట్రంలో లేరని జీడిమెట్ల పోలీసులు కోర్టుకు తెలిపారు. వివేకానందకు వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా సమన్లు పంపాలని ఆదేశించింది. విచారణ మార్చి 8కి ప్రజాప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవి నామినేషన్

ABOUT THE AUTHOR

...view details