తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకట్టుకున్న గురుకుల విద్యార్థుల సమ్మర్​ సమురాయ్​

చదువు, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు ప్రస్తుతం విద్యావ్యవస్థలో ఇదే పంథా నడుస్తోంది. కానీ ఇవే కాకుండా విద్యార్థులకు నృత్యం, సంగీతం ఇలా ఇతర రంగాల్లో కూడా ప్రోత్సహించేలా సమ్మర్​ సమురాయ్​ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​ రవీంద్రభారతిలో వీటి​ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

సమ్మర్​ సమురాయ్​ కార్యక్రమం

By

Published : Apr 26, 2019, 10:18 PM IST

హైదరాబాద్​ రవీంద్ర భారతిలో తెలంగాణ గిరిజన సంక్షేమ, గురుకుల విద్యాలయ సంస్థల రెండో దశ సమ్మర్​ సమురాయ్​ క్యాంప్​ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులకు కేవలం చదువు, పరీక్షలు మాత్రమే కాకుండా సంగీతం, నృత్యం, క్రీడలు, సాంకేతిక శిక్షణ ఇలా అన్నీ రంగాల్లో ప్రోత్సహించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆట పాటలు, మాటలతో వీక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. పాశ్చాత్య, సాంప్రదాయ, జానపద నృత్యాలతో పాటు శాస్త్రీయ సంగీతంతో అదరహో అనిపించారు. చిన్నారుల చేసిన సాంఘిక నాటికలు ఆలోచింపజేశాయి.

పరీక్షలంటే భయం లేదు

ప్రభుత్వ గురుకులాల్లో చదివే ఏ విద్యార్థికీ పరీక్షలంటే భయం లేదని ట్రెయ్స్​ కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు. సమ్మర్​ సమురాయ్​ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేయి మందితో ప్రారంభమైన సమ్మర్​ సమురాయ్​ 75 వేల మందితో నడుస్తోందని అన్నారు.
గురుకుల విద్యార్థులు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ చదువుతున్నారని సమ్మర్​ సమురాయ్​ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : థానోస్​ పవర్​ను వాడుకుంటున్న గూగుల్

ABOUT THE AUTHOR

...view details