తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు.. 24 నుంచి వేసవి సెలవులు - summer holidays from april 24 to june 12

రాష్ట్రంలోని 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు నేటి నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 22తో పరీక్షలు పూర్తి కానున్నాయి. 23న ఫలితాలు.. 24 నుంచి వేసవి సెలవులు ఉండనున్నాయి.

నేటి నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు.. 24 నుంచి వేసవి సెలవులు
నేటి నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు.. 24 నుంచి వేసవి సెలవులు

By

Published : Apr 16, 2022, 5:25 AM IST

రాష్ట్రంలో 1 నుంచి 9 తరగతుల పరీక్షలకు సంబంధించి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-2) పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాల ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ)లు ప్రశ్నపత్రాలను ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు పంపించాయి. ఈ నెల 22వ తేదీతో పరీక్షలు పూర్తవుతాయి. వాటి ఫలితాలను మరుసటి రోజు 23వ తేదీన వెల్లడిస్తారు. రెండేళ్ల నుంచి ప్రోగ్రెస్‌ కార్డులను ముద్రించకుండా విద్యాశాఖ నిర్లక్ష్యం వహించడంతో ఆన్‌లైన్‌లో పొందుపరిచిన ప్రోగ్రెస్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో మార్కుల వివరాలు నమోదు చేయనున్నారు.

ఈ నెల 24వ తేదీ నుంచి జూన్‌ 12వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొంది. జూన్‌ 13న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగుతాయి. ప్రధాన పరీక్షలు మే 28వ తేదీతో ముగుస్తాయి. ఆ విద్యార్థులకు మే 22 వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి.

ABOUT THE AUTHOR

...view details