Summer Camp At Shilparamam: హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపునకు విశేష స్పందన వస్తోంది. మట్టికుండలు, మట్టిబొమ్మల తయారీతో పాటు మదుబని, నిర్మల్ పెయింటింగ్‌లలో శిక్షణ ఇస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్ కిషన్‌రావు ఆధ్వర్యంలో... ఈనెల 15 నుంచి 31 వరకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అవకాశం కల్పించారు. సంస్కృతం మాట్లాడటం, భగవత్ గీత శ్లోకాలు కూడా నేర్పిస్తున్నామని శిల్పారామం మేనేజర్ అంజయ్య తెలిపారు. అనుభవం ఉన్నవారితో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు.
Summer Camp At Shilparamam: శిల్పారామంలో ఆకట్టుకుంటున్న సమ్మర్ క్యాంపు - Shilparamam Latest News
Summer Camp At Shilparamam: వేసవి వచ్చిందంటే ఓ కాలక్షేపం కావాలి. పిల్లలకు ఏదైనా నేర్పించాలని... తాము ఏదో ఒకటి నేర్చుకోవాలని అందరూ భావిస్తారు. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేశారు. మట్టికుండలు, మట్టిబొమ్మల తయారీ సహా నిర్మల్ పెయింటింగ్ వంటివి నేర్పిస్తున్నారు. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్నారు.
Shilparamam
సమ్మర్ క్యాంపులో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి నచ్చిన అంశాలను ఎంచుకుని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. కుండలు తయారు చేయడంతో పాటు మట్టితో వినాయకుడి బొమ్మలను తయారు చేస్తున్నారు. కొత్త అంశాలు నేర్చుకోవటం పట్ల చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు వల్ల కొత్తగా నేర్చుకోవాలనే తపన పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి: