అంబర్‌పేటలోని ప్రేమ్ నగర్లో శేఖర్(45) తాగిన మైకంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన శేఖర్ తాగిన మైకంలో భార్యతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. అలాగే ఈరోజు ఉదయం కూడా బాగా తాగొచ్చి ఇంట్లోకెళ్లి గడియ పెట్టుకున్నాడు. రోజూ జరిగేదే కదా అని భార్య భావించింది.
సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Suicide by hanging on to a ceiling fan
భర్త తాగడం.. భార్యతో గొడవ పడటం.. ఇంట్లోకెళ్లి తలుపు గడియపెట్టుకుని పడుకోవటం ఆ ఇంట్లో సర్వ సాధారణం.. ఈరోజు కుడా రోజులాగే భర్త తాగి వచ్చి పడుకుంటాడని భార్య అనుకుంది. కానీ తాగొచ్చిన భర్త ఇంట్లోకెళ్లి గడియ పెట్టుకుని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అంబర్‌పేటలోని ప్రేమ్ నగర్లో చోటుచేసుకుంది.
సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య
కానీ తర్వాత తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో తలుపు పగులగొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. మృతుడు శేఖర్ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : హెచ్ఆర్సీ పిలుపు: పోలీస్ అకాడమీకి 'దిశ' తల్లిదండ్రులు