హైదరాబాద్ అరణ్య భవన్లో ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొడంగల్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మోహినుద్దీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు.
అటవీశాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం - Suicide Attempt Employee At Aranya Bhavan in Hyderabad
హైదరాబాద్ అరణ్యభవన్‌లో ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాతబకాయిలు చెల్లించకుండా పై అధికారి వేధిస్తున్నాడని బలవన్మరణానికి యత్నించాడు.

అటవీశాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఫీల్డ్‌లో పనుల నిమిత్తం ఖర్చు చేసిన బిల్లులు చెల్లించకుండా... కొడంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి వెంకట్ గౌడ్ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా బిల్లుల కోసం ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
అటవీశాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఇదీ చూడండి: 'అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత- షా రాజీనామా చేయాలి