'ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం వల్ల ఆర్టీసీ ఈయూ నేత కరోనాతో మృతి' - ఈయూ నేత నిస్సార్ తాజా వార్తలు
11:56 July 08
'ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం వల్ల ఆర్టీసీ ఈయూ నేత కరోనాతో మృతి'
ప్రజాగాయకుడు, ఆర్టీసీ ఈయూ నేత సుద్దాల నిస్సార్ కరోనాతో మృతి చెందారు. ఆస్పత్రుల్లో చేర్చుకోకనే నిస్సార్ కరోనాతో చనిపోయారని ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. ఈయూ నేత, రచయిత, ప్రజా నాట్యమండలి కార్యదర్శిగా నిస్సార్ సేవలందించారని కొనియాడారు. నిస్సార్ చాలా ప్రైవేటు ఆస్పత్రులు తిరిగినా.. ఎవరు చేర్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి గాంధీ ఆస్రత్రిలో చేరితే వెంటిలేటర్ లేక తుదిశ్వాస విడిచారన్నారు. నిస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలని రాజిరెడ్డి ప్రార్థించారు.
ఇవీ చూడండి:ప్రైవేట్లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్