హైదరాబాద్ విమానాశ్రయంలో 60 ఏళ్ల మహిళ మృతి చెందింది. సుడాన్‌కు దేశానికి చెందిన మహ్మద్ తాహ అలీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం హైదరాబాద్ వచ్చింది. బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో చికిత్స పొందింది. తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. బార్డర్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కుతుండగా.. ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే విమానాశ్రయ సిబ్బంది, బంధువులు ఆమెను ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. సుడాన్ మహిళ మృతి - శంషాబాద్ ఎయిర్‌పోర్టు
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో సుడాన్ దేశానికి చెందిన మహిళ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో క్యాన్సర్ చికిత్స తీసుకుని తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో కుప్పకూలిపోయింది.

Sudan Women Die In Shamshabad Airport