తెలంగాణ

telangana

By

Published : Jun 2, 2020, 6:36 AM IST

ETV Bharat / state

స్వరాష్ట్రంలో సిక్సర్ కొట్టిన కేసీఆర్

ప్రతి మనసూ పట్టుబట్టి కోరితే.. ప్రతి మనిషీ జట్టుకట్టి పోరితే సిద్ధించిన తెలంగాణ గడ్డ.. పసిడి వన్నెలద్దుకుంటోంది. ఎందరో త్యాగాలకు ప్రతీకగా సాకారమైన కలల రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తున్నారు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.

telanagana formation day
ఆరోహణం

ఎండిన బీళ్లు, సాళ్లే కాదు.. తడారిన నోళ్లూ... నీళ్లతో తడుస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రమంతటా నిరంతరాయ కాంతులు విరజిమ్ముతున్నాయి. అప్పుల్లో చిక్కిశల్యమవుతున్న అన్నదాత రుణాలతో పాటు, కష్టాలూ మాఫీ అవుతున్నాయి. పంట సిరుల్ని ఉప్పొంగిస్తూ తెలంగాణ అవతరణ దినోత్సవం స్ఫూర్తిగా మరిన్ని విజయ ప్రస్థానాలకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతోంది. అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా చేసుకున్న తెలంగాణ అతి తక్కువ సమయంలోనే తన విశిష్టతను చాటుకుని పలు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచింది.

ఐటీ రంగంలోనూ రాష్ట్రం ప్రముఖంగా రాణిస్తోంది. యువతను, మహిళలను అంకుర పరిశ్రమల్లో ప్రోత్సహించేందుకు దేశంలో మొదటిసారిగా టీహబ్‌, వీహబ్‌ను ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలు పురస్కారాలను ప్రకటించడమే కాదు నీతిఆయోగ్‌ సైతం పలుసార్లు తెలంగాణ ప్రస్థానాన్ని ప్రశంసించింది.

రైతులు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు, పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతలను వేగంగా పూర్తి చేసింది. ఇంటింటికీ ‘మిషన్‌ భగీరథ’ నీటిని సరఫరా చేస్తోంది. రైతుబంధు, బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు.. అన్నదాతల ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. నిరంతర విద్యుత్తు సరఫరా అవుతోంది.

46 లక్షల మందికి పింఛన్లు ‘ఆసరా’గా నిలుస్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ల ద్వారా యువతుల పెళ్లిళ్లకు సాయం, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్ల ద్వారా అండ లభిస్తోంది. సర్కారీ దవాఖానాల్లో మౌలిక వసతులు, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్య లక్ష్మి, ఉచిత వ్యాధి నిర్ధారణ, కిడ్నీ బాధితులకు ఉచిత డయాలసిస్‌ వంటి ఎన్నో పథకాలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని... వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి నివేదికలను రంగాల వారీగా ప్రభుత్వం విడుదల చేసింది.

ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details