కొవాగ్జిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ వాలంటీర్ల డిశ్చార్జ్
15:05 July 21
కొవాగ్జిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ వాలంటీర్ల డిశ్చార్జ్
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌లో ముందడుగు పడింది. సోమవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు వాలంటీర్లకు కొవాగ్జిన్ ఇచ్చారు. ఆ ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఇద్దరు వాలంటీర్లను మంగళవారం డిశ్చార్జ్ చేశారు. 14 రోజుల పాటు వాలంటీర్ల ఆరోగ్యాన్ని నిమ్స్ బృందం పర్యవేక్షించనుంది. 14 రోజుల తర్వాత వారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: దేవాదాయ నిధులను అమ్మఒడికి ఎలా మళ్లిస్తారు?: కన్నా