వచ్చే ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వంరైతులకు అందించే విత్తనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రకటించింది. సోయాబీన్‌పై 40.65 శాతం, జీలుగపై 65, జనుముపై 65, పిల్లిపెసరపై 65 శాతం సబ్సిడీని అందించనుంది. సోయాబీన్ విత్తనాలు క్వింటాకు రూ.6,645 ఉండగా.. సబ్సిడీ పోను రైతులకు రూ. 3,944కే లభించనుంది. జీలుగ క్వింటా విత్తనాల ధర రూ.5,395 ఉండగా.. రూ.1,888కు అందించనుంది. జనుము విత్తనాల సాధారణ ధర క్వింటాకు రూ. 6,600 ఉండగా.. సబ్సిడీ అనంతరం రూ.2,310కు లభించనుంది. పిల్లిపెసర క్వింటాకు రూ. 9వేలు కాగా... రైతులు సబ్సిడీ అనంతరం 3,150 రూపాయలకు పొందొచ్చు.
విత్తన సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం - soyabin subsidy in telangana
ఎన్ఎస్పీ పథకం ప్రకారం ఖరీఫ్ సీజన్లో రైతులకు అందించే సోయాబీన్, జీలుగ తదితర విత్తనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. సోయాబీన్‌పై 40.65శాతం, జీలుగపై 65, జనుముపై 65 , పిల్లిపెసరపై 65 శాతం సబ్సిడీని అందించనుంది.

విత్తన సబ్సిడీని ప్రకటించిన ప్రభుత్వం