Submerged crop: ఏపీలో వైసీపీ నేత తన స్వార్థానికిచేసిన పని వల్ల పంట నీట మునిగి నష్టపోయామని కృష్ణాజిల్లా నందివాడ మండలం నూతలపాడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతలపాడు ఎస్సీ కాలనీలో ఉన్న తన పొలానికి సాగునీరు అవసరమై.. రైతులకు ఎటువంటి సమాచారం అందించకుండా వైసీపీ నేత అర్ధరాత్రి కాలువ గేట్లు ఎత్తించడంతో.. చేతికొచ్చిన పంట నీట మునిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి ఎత్తిన కాలువ గేట్లు.. నీట మునిగిన పంట - నీటి మోటార్
Submerged crop: ఆపద వస్తే అందరికీ అండగా ఉండి ఆదుకోవాల్సిన నాయకుడు.. తన స్వార్థం కోసం అర్ధరాత్రి కాలువ గేట్లు ఎత్తించడంతో అనేకమంది రైతుల పంట నీటిపాలైంది. తెల్లవారుజామున వచ్చి పంట కోసేందుకు వచ్చిన రైతులు.. నీట్లో మునిగి ఉండటంతో లబోదిబోమంటున్నారు. తమను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
పంట కోసేందుకు అన్ని సిద్ధం చేసి.. పొలాల్లో మినుము విత్తనాలు కూడా చల్లించామని.. తెల్లవారుజామున వచ్చి చూస్తే పంట నీట మునిగిందని రైతులు వాపోయారు. వైసీపీ నేత ఒత్తిడితో.. ఇరిగేషన్ సిబ్బంది అనాలోచిత చర్య వల్ల నష్టపోయిన తమను ఎవరు ఆదుకుంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎంపీటీసీ అయ్యి ఉండి వైసీపీ నేత చేసిన చర్యను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. కొందరు రైతులు ప్రత్యేకంగా మోటర్లు ఏర్పాటు చేసి, పొలాల్లోని నీటిని బయటకు తోడుతూ నష్ట నివారణ చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఇవీ చదవండి: