ఎల్‌ఆర్‌ఎస్, 131 జీవోపై.. సబ్ రిజిస్ట్రార్ల సంఘం మాజీ అధ్యక్షుడితో ముఖాముఖి! - Sub Registrars Association Ex President Vijaya Bhaskar Rao Face to Face on LRS, 131 G.O
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశ్యంతోనే ఎల్‌ఆర్‌ఎస్ జీవో 131ని తెచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు విజయభాస్కర్ రావు అభిప్రాయపడ్డారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ జీవోలకు తాజాగా ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ జీవోకు చాలా తేడా ఉందని ఆయన స్పష్టం చేశారు. మొదట అనుమతులు లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయరాదని రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు ఇచ్చిన తరువాతే ఈ ఎల్‌ఆర్‌ఎస్ జీవోను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. అంటే ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోని, అనుమతులు లేని ప్లాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్లు కావని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్, జీవో 131 గురించి పలు వివరాలు ఆయన ఈటీవీ భారత్ ముఖాముఖిలో పంచుకున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్, 131 జీవోపై.. సబ్ రిజిస్ట్రార్ల సంఘం మాజీ అధ్యక్షుడితో ముఖాముఖి!