రాష్ట్రంలో రేపటి నుంచి సాధారణ సమయాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పని చేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని పరిపాలన డీఐజీ సుభాషిణి తెలిపారు.
Registrations: పూర్తిస్థాయిలో పనిచేయనున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు - లాక్‌డౌన్ రిలాక్సేషన్స్
రేపటి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.
పూర్తిస్థాయిలో పనిచేయనున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు
రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని సుభాషిణి వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు కొనసాగించాలని ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారు.
ఇదీ చదవండి:Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!