సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణ అంశంపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. ప్రస్తుత భవనాల్లో సౌకర్యాలు, స్థితిగతులపై అధ్యయనానికి నలుగురు ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇంజినీర్లు రవీందర్రావు, మురళీధర్, సత్యనారాయణరెడ్డి కమిటీ సభ్యులుగా ఉంటారు. సచివాలయం, అసెంబ్లీ భవనాలకు మరమ్మతులు చేయాలా... నూతన భవంతులు నిర్మించాలా... అనేది పరిశీలించి వీరు నివేదిక ఇవ్వనున్నారు.
సచివాలయం, అసెంబ్లీ భవనాల అధ్యయనానికి కమిటీ - సచివాలయ స్థితిగతులపై కమిటీ సమీక్ష
ప్రస్తుతం ఉన్న సచివాలయం భవనాలకు మరమ్మతులు లేదా వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించాలా అనే దానిపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఓ కమిటీని నియమించింది. సచివాలయంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
మంత్రివర్గ ఉపసంఘం