హైదరాబాద్ తార్నాకలోని శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని టీఎస్ఎమ్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పాఠశాల భవనానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విద్యాశాఖ నోటీసులు జారీ చేసినా పాఠశాల నడిపిస్తున్నారని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న భవనంలో పాఠశాల నిర్వహిస్తున్నారని ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
విద్యార్థులకు ఏమైనా జరిగితే... ఎవరిది బాధ్యత? - విద్యార్థులకు ఏమైనా జరిగితే... ఎవరిది బాధ్యత?
నిర్మాణంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![విద్యార్థులకు ఏమైనా జరిగితే... ఎవరిది బాధ్యత?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3428064-866-3428064-1559229262616.jpg)
పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు
పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు
ఇవీ చూడండి: సామాన్యుడి నుంచి శక్తిమంతమైన నేతగా...
TAGGED:
tarnaka-school-andolana