Students protest gas leaked issue: మారేడ్‌పల్లిలోని కస్తూర్బా కళాశాలలో ఇటీవల గ్యాస్ లీకైన ఘటనలో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది కొందరు డిశ్చార్జ్ అయ్యారు. మరికొందరు ఇంకా ఆ ప్రభావం నుంచి బయటపడలేదు. గ్యాస్ ప్రభావంతో ఇప్పటికీ తమకు కడుపులో నొప్పి, వాంతులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతున్నాయని విద్యార్థులు తెలిపారు.
కస్తూర్బాలో గ్యాస్ లీకేజీ ఘటనపై విద్యార్థుల ఆందోళన
Students protest gas leaked issue: సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని కస్తూర్బా కళాశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గ్యాస్ లీకేజీ ఘటనపై కళాశాల యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకొని తమ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు
Etv Bharat
ఈరోజు మరో ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు తెలిపారు. కళాశాల యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకొని తమ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. తమకు ఇంటర్నల్స్ పరీక్షలలో మార్కులు తగ్గించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుందని వెంటనే ఆ చర్యను ఆపేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు.
ఇవీ చదవండి :