హైదరాబాద్ నిజాం కళాశాల ఆవరణలో ఓ సినిమా షూటింగ్ నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో షూటింగ్ నిర్వహించడంపై విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో.. ఎలా అనుమతించారని ప్రిన్సిపల్ను నిలదీశారు.
నిజాం కళాశాలలో సినిమా షూటింగ్ నిలిపివేయాలి : విద్యార్థి సంఘం - students union protest in Nizam college
పరీక్షలు జరుగుతున్న సమయంలో నిజాం కళాశాల ఆవరణలో సినిమా షూటింగ్ నిర్వహించడంపై విద్యార్థి సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ జరుపుతున్నారని మండిపడ్డారు.
నిజాం కళాశాలలో సినిమా షూటింగ్ నిలిపివేయాలి
కరోనా నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ జరుగుతోందని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కళాశాల ప్రిన్సిపల్, స్థానిక పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సినిమా యూనిట్ నిర్వాహకులు తెలిపారు.