తెలంగాణ

telangana

ETV Bharat / state

స్టడీ సర్కిళ్లలో కనీస వసతులు లేవని విద్యార్థుల ధర్నా

షెడ్యూల్​ కులాల స్టడీ సర్కిళ్లలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆందోళన చేశారు. తక్షణమే ప్రధాన సమస్యలు పరిష్కరించాలని... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

students protest_AT_SC_STUDY_CIRCLE_in hyderabad
స్టడీ సర్కిళ్లలో కనీస వసతులు లేవని విద్యార్థుల ధర్నా

By

Published : Dec 5, 2019, 2:54 PM IST

హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని షెడ్యూల్ కులాల స్టడీ సర్కిళ్లలో సరైన కనీస వసతులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ధర్నా చేశారు. దిల్​సుఖ్​నగర్​లోని స్టడీ సర్కిల్​ ఎదుట బైఠాయించారు.

లైబ్రరీ, మంచి భోజనం, త్రాగునీరు, మెడికల్స్ చెకప్ కిట్స్​ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల కోసం భద్రతా సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అన్ని ప్రధాన సమస్యలపై డైరెక్టర్​ సంప్రదిస్తే తమ జీతాలకే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.

తక్షణమే ప్రధాన సమస్యలు పరిష్కరించాలని... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు.

స్టడీ సర్కిళ్లలో కనీస వసతులు లేవని విద్యార్థుల ధర్నా

ఇవీ చూడండి: రాత్రి 8 వరకే మహిళా కండక్టర్ల విధులు

ABOUT THE AUTHOR

...view details