తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ఉద్రిక్తత - మరోసారి ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ఉద్రిక్తత

ఇంటర్ బోర్డ్ ముందు మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఇవాళ ప్రారంభమైన సప్లిమెంటర్ పరీక్షల్లో బోర్డు నిర్లక్ష్యంపై ఏబీవీపీ ఆందోళనకు దిగింది.

మరోసారి ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ఉద్రిక్తత

By

Published : Jun 7, 2019, 12:00 PM IST

ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ఉద్రిక్తత

నాంపల్లిలో ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళానికి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. ముందస్తు సమాచారం ఉన్న పోలీసులు.. కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు లోనికి వెళ్లేందుకు యత్నించగా వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఉద్యోగ సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.
ఇదీ చదవండి: ఇంటర్మీడియట్​ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details