తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులూ... మానసిక సమస్యలుంటే ఫోన్‌ చేయండి

దేశవ్యాప్యంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది... విద్యార్థుల పరీక్షలు, చదువులు ఆగిపోయాయి.. ఈ కారణంగా పలువురు స్టూడెంట్స్​ మానసికంగా ఆవేదన చెందుతున్నారు. గుర్తించిన జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి దేశవ్యాప్తంగా కౌన్సిలర్లను నియమించింది. సందేహాలుంటే ఫోన్​ చేయాలని తెలిపింది.

students problems call me with mental problems
విద్యార్థులూ... మానసిక సమస్యలుంటే ఫోన్‌ చేయండి

By

Published : Apr 25, 2020, 10:34 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా పరీక్షలు వాయిదా పడటం, ఇంట్లోనే ఉండిపోవాల్సి రావడం తదితర కారణాలతో విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) దేశవ్యాప్తంగా కౌన్సిలర్లను నియమించింది. సమస్యల విషయంలో విద్యార్థులు ఫోన్‌ చేస్తే వారు తగిన సలహాలు ఇస్తారు. తెలంగాణకు సంబంధించి ఐదుగురు కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.

  • ఈమని ప్రశాంత మాధురి (9866797001)
  • చిలుకా ఉమారాణి (9492922357..ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు)
  • బాలాజీ (8978264825..మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు)
  • కె.రోహిణి (9662141783..ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు)
  • పి.కృష్ణ మోహన్‌ (7981953477..సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు)

ABOUT THE AUTHOR

...view details