హైదరాబాద్ సీతాఫల్మండిలోని ప్రభుత్వ పాఠశాలలో మ్యాజిక్ బస్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ పేద విద్యార్థులకు షూ పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ సామల హేమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'విద్యార్థులు పాఠశాలల్లో జాగ్రత్తలు పాటించాలి' - కార్పొరేటర్ సామల హేమ
పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ సూచించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'విద్యార్థులు పాఠశాలల్లో జాగ్రత్తలు పాటించాలి'
విద్యార్థుల కోసం సంస్థ చేసిన కృషికి హేమ అభినందనలు తెలిపారు. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాగా చదివి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.
ఇదీ చదవండి:'పాఠశాలలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయండి'