తెలంగాణ

telangana

ETV Bharat / state

USA Education: అమెరికాలో చదివేందుకు విద్యార్థుల ఆసక్తి - America education news

విదేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మాస్టర్స్‌, పీహెచ్‌డీ చదవాలనుకునే వారి కోసం ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ ఇటీవల ఏర్పాటు చేసిన వర్చువల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లో అమెరికాలోని 101 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి.

America
యూఎస్‌ఏ

By

Published : Sep 2, 2021, 8:51 AM IST

అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తి చూపే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మాస్టర్స్‌, పీహెచ్‌డీ చదవాలనుకునే వారి కోసం ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ ఇటీవల ఏర్పాటు చేసిన వర్చువల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లో అమెరికాలోని 101 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. దక్షిణ, మధ్య ఆసియా ఖండంలోని నాలుగు దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ పరిధిలో దేశవ్యాప్తంగా ఆరు వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచే 32 శాతం మంది అంటే 1,962 మంది విద్యార్థులు ఉన్నారు. మరోపక్క దేశంలో అన్ని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
వీసాలు పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహం.. అవసరమైన పత్రాలు, అమెరికాలో చదువుకోవాలంటే అర్హత పరీక్షలైన టోఫెల్‌, జీఆర్‌ఈ, పీటీఈ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి.. తదితర అంశాలను వివరించేందుకు వీసా అధికారులు, ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ నిపుణులు ఈ ఫెయిర్‌లో పాల్గొన్నారు. కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ, న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సిరక్యూస్‌, వెర్మోంట్‌, సెంట్రల్‌ మిషిగన్‌, పిట్స్‌బర్గ్‌ స్టేట్‌ తదితర విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి.

శుక్రవారం డిగ్రీ విద్యార్థుల కోసం..

అమెరికాలో డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల కోసం శుక్రవారం వర్చువల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం అయిదున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు నిర్వహించనున్నారు. అందులో పాల్గొనదలచిన వారు https://bit.ly/UGEdUSAFair21EmbWebద్వారా నమోదు చేసుకోవచ్చు.

భారతీయ విద్యార్థులది రెండో స్థానం..

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులది రెండో స్థానమని(18శాతం) హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్మాన్‌ బుధవారం పేర్కొన్నారు. ‘‘వర్చువల్‌ ఎడ్యుకేషనల్‌ ఫెయిర్‌తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అమెరికాలో ఉన్నత చదువుల తీరుతెన్నులు, అక్కడ ఉన్న అవకాశాలపై అవగాహన ఏర్పడుతుంది’’అని జోయెల్‌ రీఫ్మాన్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

KRMB AND GRMB MEETING: ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం

KRMB MEETING: కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్

ABOUT THE AUTHOR

...view details