తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథలకు విద్యార్థుల ఆపన్నహస్తం - SILVER OKS

రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచనలతో సాటి విద్యార్థులకు సాయం చేస్తున్నారు. ఏటా కూడబెట్టిన డబ్బును అనాథలు, అభ్యాగులైన విద్యార్థులకు అందజేస్తున్నారు. ఎనిమిది నెలల్లోనే  ఏకంగా 18 లక్షల రూపాయలు కూడబెట్టి... రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌కు అందజేశారు. పది సంవత్సరాలుగా పేద విద్యార్థులకు తమవంతు సహాయం చేస్తూ... ఆ చిన్నారులు సేవాగుణాన్ని చాటుకుంటున్నారు.

అనాథలకు విద్యార్థుల ఆపన్నహస్తం

By

Published : Feb 1, 2019, 5:15 AM IST

అనాథలకు విద్యార్థుల ఆపన్నహస్తం
అనాథలు, అభ్యాగులకు చేయూత నివ్వాలన్న మాటలు ఆ విద్యార్థులను కదిలించాయి. సాయం చేయాలన్న సంకల్పంతో చిట్టి చేతులన్నీ ఎకమయ్యాయి. ఎనిమిది నెలల్లోనే ఏకంగా 18 లక్షల రూపాయలు కూడబెట్టి... రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌కు అందజేశారు. పది సంవత్సరాలుగా పేద విద్యార్థులకు తమవంతు సహాయం చేస్తూ... ఆ చిన్నారులు సేవాగుణాన్ని చాటుకుంటున్నారు.

రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచనలతో సాటి విద్యార్థులకు సాయం చేస్తున్నారు. ఏటా కూడబెట్టిన డబ్బును అనాథలు, అభ్యాగులైన విద్యార్థులకు అందజేస్తున్నారు. చదువుకోలేని స్థితిలో ఉండే వారికి సాయం చేయాలని చెప్పిన ఉపాధ్యాయుల మాటలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. పదేళ్ల నుంచి ఇప్పటి వరకు అక్షరాలా కోటి రూపాయలు అందజేశారు.
ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో యాజమాన్యం విద్యార్ధులకు కిడ్డీ బ్యాంకులను అందజేస్తుంది. వారు వాటిలో డబ్బులు జమ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే జేబు ఖర్చులతో పాటు రకరకాల ప్రదర్శనలు, పాఠశాలలోనే క్యాంటిన్‌ నిర్వాహణ, జన్మదినం సందర్భంగా వచ్చే కానుకలు తదితర మార్గాల ద్వారా విద్యార్ధులు డబ్బులను కూడబెడుతున్నారు. విద్యార్ధులకు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కూడా సహకరిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి తమ వంతుగా సాయమందిస్తున్నారు.
విద్యార్ధులు ఏటా చేస్తున్న సహాయ కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని యాజమాన్యం చెబుతోంది.

ABOUT THE AUTHOR

...view details