Tension at HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వైస్ ఛాన్స్లర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఒకే దేశం-ఒకే పరీక్ష పేరుతో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
హెచ్సీయూలో ఫీజులపై విద్యార్థుల ఆందోళన.. స్వల్ప ఉద్రిక్తత.. - హైదరాబాద్ తాజా వార్తలు
Tension at HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేసిన ధర్నా కాసేపు ఉద్రిక్తంగా మారింది. యూనివర్సిటీ అధికారులు.. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేయడం, రాష్ట్రంలో చేపట్టిన పోటీ పరీక్షల తేదీ, యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ ఒకే రోజు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు.
దీంతోపాటే రాష్ట్రంలో చేపట్టిన వివిధ పోటీ పరీక్షల తేదీ.. యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ ఒకే రోజు నిర్వహించడం వల్ల తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు నష్టపోతారని పీహెచ్డీ పరీక్ష తేదీని మార్చాలని వారు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థులను వైస్ ఛాన్స్లర్ కార్యాలయం నుంచి తరలించడానికి వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించగా.. కాసేపు తోపలాట జరిగి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అయినా విద్యార్థులు ఆందోళన విరమించకపోవడంతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ క్వాలిఫై ఫీజు రద్దు చేశారు. దీంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు.
ఇవీ చదవండి: