హైదరాబాద్ తార్నాకలోని ఇఫ్లూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. సురేశ్‌ను వెంటనే విధుల్లోంచి తొలిగించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. యూజీసీ నిబంధనల మేరకు వసతి గృహలు ఇప్పటికే తెరుచుకోవాల్సి ఉన్నా.. తెరవకుండా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి. హాస్టల్స్‌ను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ.. ఇఫ్లూ ఎదుట ధర్నా చేపట్టాయి.
ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన - ఎస్ఎఫ్ఐ
హైదరాబాద్ తార్నాకలోని ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట.. పలు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. వైస్ ఛాన్సలర్‌ను తక్షణమే తొలిగించాలి డిమాండ్ చేశాయి.
యూనివర్సిటీలో ఇటీవల జరిగిన టీచర్ రిక్రూట్మెంట్లో జరిగిన అవకతవకలు బహిర్గతం కాకుండా ఉండటానికే హాస్టళ్లను తెరవకుండా అడ్డుపడుతున్నారని.. సంఘాల నేతలు ఆరోపించారు. వసతి గృహాలను వెంటనే తెరిచి విద్యార్థులకు సహకరించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో.. ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి శ్రీను, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి నరేశ్‌తో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రజలకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది: మల్లన్న