ఉస్మానియా యూనివర్సిటీ భూములపై కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విమెన్ నాయకురాలు వి.సంధ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎమ్. శ్రీనివాస్, పలువురు విద్యార్ధి సంఘ నాయకులు ఆక్రమిత స్థలం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసినటువంటి వాళ్లు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల హక్కులను సుదీర్ఘ కాలంగా పెండింగ్లో పెట్టి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. లాక్డౌన్ సమయంలోనే నిర్మాణాలు చేపట్టి అనేక సందేహాలకు చోటిచ్చారని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అక్రమార్కులకు అనుకూల ప్రభుత్వాలు ఉన్నందువల్లే ఇప్పుడు నిర్మాణాలను చేపట్టారని అన్నారు.