తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆందోళన - ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్​లైన్​ తరగతులు నిర్వహించాలని ఆందోళన

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆన్​లైన్​ పాఠాలు నిర్వహిస్తున్నాయని విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ బషీర్​బాగ్​లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.

student-unions-in-protest-front-of-the-education-minister-office-at-basheerbagh
మంత్రి కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

By

Published : Aug 12, 2020, 4:19 PM IST

మంత్రి కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

ఆన్​లైన్ తరగతుల పేరిట డబ్బులు దండుకుంటున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. హైదరాబాద్ బషీర్​బాగ్​లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభించి చాలా రోజులు అయిందన్నారు. ప్రభుత్వం వారిని కట్టడి చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఆన్​లైన్​ సౌకర్యం కల్పించక పోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని పీడీఎస్​యూ, ఎస్​ఎఫ్​ఐ, ఏఐఎస్​ఎఫ్​, ఏఐడీఎస్​ఓ నాయకులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించి వెంటనే ఆన్​లైన్ తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి :ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్​ఎస్​యూఐ ప్రగతిభవన్​ ముట్టడి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details