ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో పురుగుల మందు సేవించి ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సత్యనారాయణపురానికి చెందిన కొల్లి నాగవెంకట తేజగా గుర్తించారు. మృతుడు స్థానికంగా ఓ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఎంబీఏ విద్యార్థి బలవన్మరణం - drinking insecticide
పురుగుల మందు సేవించి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మైలవరంలో చోటుచేసుకుంది. మృతుడు ఖమ్మం జిల్లా వాసి అయిన నాగవెంకటతేజగా గుర్తించారు. అతను స్థానికంగా ఓ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.
ఎంబీఏ విద్యార్థి బలవన్మరణం