హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ధనలక్ష్మి అనే యువతి అదృశ్యమైంది. హిమాయత్ నగర్ పైప్ లైన్ బస్తీలో నివాసముండే శ్రీనివాస్, సరస్వతిల కూతురు ధనలక్ష్మీ(19). ఈ నెల 2వ తేదీ నుంచి తమ కూతురు కనిపించట్లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. బంధువుల, స్నేహితుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.