హైదరాబాద్ చంపాపేటలోని శ్రీ త్రివేణి పాఠశాలలో 'స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్' ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు పలు ప్రయోగాలను ప్రదర్శించారు. పలు సందేశాత్మక చార్టులు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ప్రదర్శించారు. పలు ఆలోచనాత్మక ప్రయోగాలు, నమూనాలు ఆకట్టుకున్నాయి.
స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్‌లో 'కరోనా' ప్రదర్శన - STUDENTS PLAYED CORONA AWARENESS PROGRAM
ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్‌పై పిల్లలు అవగాహన ప్రదర్శన చేశారు. ఇది ఎక్కడో కాదండీ... పాఠశాలలో నిర్వహించిన స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది.
కరోనా వైరస్‌పై అవగాహన కలిగించేలా చిన్నారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇంట్లోని తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని తెలిపేలా సందేశమిచ్చారు. వైరస్ సోకకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలు వివరించి శబాష్ అనిపించారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రజలంతా భయపడుతున్న కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భయపడాల్సిన అవసరం లేదని... కొన్ని జాగ్రత్తలు తీసుకుని వైరస్‌ను అరికట్టవచ్చని ఉపాధ్యాయులు వివరించారు.