Student died of a heart attack: ఏపీలోని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట సాయిశంకర్ అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థి కడప జిల్లా బి. కోడూరు మండలం గోవిందపురానికి చెందినవాడు. శంకర్‌ను ట్రిపుల్ ఐటీ అంబులెన్స్‌లో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం... విద్యార్థి గుండెపోటుతో మృతి - ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ
Student died of a heart attack: ఏపీలోని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట సాయిశంకర్ అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందారు.
ఉదయం స్నేహితులతో కలిసి శంకర్ వ్యాయామం చేసేందుకు వెళ్లాడని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి తెలిపారు. వ్యాయామం చేసి వస్తున్న సమయంలో ఆ విద్యార్థికి గుండె నొప్పి వచ్చిందన్నారు. స్నేహితులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలిస్తుండగా నంది మండలం వద్దకు వెళ్లగానే పల్స్ పడిపోవడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించినట్లు డైరెక్టర్ తెలిపారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని.. దీంతో మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చామని డైరెక్టర్ తెలిపారు.
ఇవీ చదవండి: