cycling rally at Hyderabad Public School: కాలుష్య నియంత్రణకు.. మెరుగైన ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతగానో దోహదపడుతుందని అంతర్జాతీయ సమాఖ్య ప్రతినిధులు పేర్కొన్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అంతర్జాతీయ సైక్లింగ్ సమాఖ్య ప్రతినిధుల ఆధ్వర్యంలో విద్యార్థుల సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించారు. ఒలింపిక్స్‌లో సైక్లింగ్‌కు చాలా ప్రాధాన్యత ఉందని విద్యార్థులకు సైక్లింగ్ అలవర్చడం వల్ల వారు ఒలింపిక్స్ కూడా ఎంపిక అయ్యే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైక్లింగ్ క్లబ్ సెంటినరీ సెలబ్రేషన్స్‌లో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ సైక్లింగ్ సమాఖ్య ఛైర్మన్ గ్రహం వాట్సన్ హాజరయ్యారు.
భారతదేశం సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంది: వీరితో పాటు అఖిల భారత సైక్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సత్యనారాయణ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రతినిధులు పాల్గొన్నారు. సైక్లింగ్ ప్రాధాన్యతను ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేస్తూ సైక్లింగ్ మూలంగా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుతుందని సైక్లింగ్ సమాఖ్య చైర్మన్ గ్రహం వాట్సన్ అన్నారు. విదేశాలలో ఇటీవల కాలంలో సైక్లింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని మనదేశంలో కూడా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు సైక్లింగ్ పెద్దపీట వేస్తూ అందరిలో అవగాహన తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి.. విద్యార్థి దశ నుంచే సైక్లింగ్ పట్ల ఆసక్తిని పెంచేందుకు సైక్లింగ్ క్లబ్ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. విద్యార్థుల సైక్లింగ్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.