Inter Student Suicide In Hyderabad : అప్పటివరకు స్నేహితులతో ఆడుతూపాడుతూ.. ఎంతో ఆనందంగా గడిచిపోతున్న విద్యార్థిని జీవితంలో ఒకేసారి పెద్ద కుదుపు వచ్చింది. అదే పదో తరగతి చదువు అయిపోయి.. ఇంకా ఇంటర్ మీడియట్లో జాయిన్ అవ్వాలి. అదీ కూడా ఇంటర్ చదువులంటే తనకు నచ్చిన కళాశాలలో కాకుండా.. ఒక ప్రముఖ విద్యాసంస్థలో తన తల్లిదండ్రులు చేర్పించారు. కళాశాలలో జాయిన్ చేసిన దగ్గర నుంచి.. ఎప్పుడు ఇంటికి వెళ్లడానికి సెలవులు ఇస్తారని ఎదురు చూసేది. ఇదే బెంగ ఆమె మనసు ఉండి.. తల్లిదండ్రులను, స్నేహితులను వదిలి వచ్చాను అనే బాధతో ఒక్కసారిగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యచేసుకొని.. బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లిలో చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిసరాలను పరిశీలించారు.
Student Suicide In Hyderabad : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన రాగుల వంశిత(16)ను వారం రోజుల క్రితం ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని బాచుపల్లి నారాయణ కళాశాలలో చేర్పించారు. ఆమె ఆ కళాశాలలో ఇంటర్ మొదటి ఏడాది ఎంపీసీ కోర్సులో జాయిన్ అయ్యింది. తన తల్లిదండ్రులు నారాయణ కాలేజ్ వసతిగృహంలో చేర్పించి.. జాగ్రత్తలు చెప్పి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. వారు వెళ్లిన దగ్గర నుంచి వంశిత ఎప్పుడు కాలేజ్‌కు సెలవులు ఇస్తారని ఆలోచిస్తూ.. ఫ్రెండ్స్‌ను ఈ విషయంపై ఎప్పుడూ అడుగుతూ ఉండేదని వారు చెప్పారు. తల్లిదండ్రులు ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారన్న బాధతో.. ఇంటి దగ్గర వారిని మిస్ అవుతున్నానన్న బాధతో ఎప్పుడూ ఉండేదని తోటి స్నేహితులు తెలిపారు. సరిగ్గా వారం రోజులు వసతిగృహంలో ఉన్న యువతి.. ఉదయం భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.