తెలంగాణ

telangana

ETV Bharat / state

తపనుంటే అన్నీ సాధ్యమే! - GOAL

ఆటో డ్రైవర్‌ నుంచి విమానం నడిపే వరకు... ఐటీ నుంచి అంతరిక్షం దాకా ఇలా అన్నీ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు ఎనలేని సేవలందిస్తున్న షీటీమ్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అమ్మాయిల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాయి.

లక్ష్యాన్ని ఛేదించండి..!

By

Published : Mar 7, 2019, 12:09 AM IST

లక్ష్యాన్ని ఛేదించండి..!
హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో షీటీమ్‌ అదనపు కమిషనర్‌ షిఖాగోయల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల ఆత్మరక్షణకు సంబంధించిన మెలుకువలను కరాటే నిపుణులు నేర్పించారు.

కాలక్షేపం చేయోద్దు...
కళాశాల రోజుల్లో ఆట, పాటలతో కాలక్షేపం చేయకుండా...అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు షిఖా గోయల్​ దిశానిర్దేశం చేశారు. సాధించాలనే తపన ఉంటే అసాధ్యమంటూ ఏమీ లేదని ఆత్మస్థైర్యం నింపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details