తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలి: గవర్నర్​

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్‌లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష జరిపారు. రెడ్‌జోన్స్‌ను గుర్తించి, హోంఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

By

Published : Apr 13, 2021, 12:28 AM IST

governor tamilisai, corona review meeting wit tamilasai
కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలి: గవర్నర్​

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో రాష్ట్రంలో రెడ్‌జోన్స్‌లో ప్రజల కదలికలను కచ్చితంగా పర్యవేక్షించాలని అధికారులను కోరారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్ల కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కరోనా వ్యాప్తి గురించి అడిగి తెలుసుకున్నారు. టీకా నిల్వలు, భవిష్యత్‌ అవసరాల గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన లబ్థిదారుల వివరాలు తెలుసుకున్నారు. 45 ఏళ్లు పైబడిన 80 లక్షల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. కరోనా వ్యాప్తి చెందడానికి గల కారణాలపై పరిశోధన చేయాలన్నారు. టీకాలు, పరీక్షలు వేగవంతం చేయడం పట్ల అధికారులను గవర్నర్‌ ప్రశంసించారు.

ఇదీ చూడండి :'మోడల్ స్కూళ్ల బోధనేతర సిబ్బందికి పీఆర్సీ వర్తింపజేయాలి'

ABOUT THE AUTHOR

...view details