తెలంగాణ

telangana

ETV Bharat / state

'హాజీపూర్‌ ఘటనపై చర్యలు తీసుకోకపోతే..ఉద్యమిస్తాం'

మహిళల వరుస హత్యలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. హాజీపూర్ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి మెమోరాండం అందజేశారు.

దోషులను కఠినంగా శిక్షించాలి : నేరెళ్ల శారద

By

Published : May 4, 2019, 8:17 PM IST

యాదాద్రి జిల్లా హాజీపూర్‌ ఘటనపై సీఎం కేసీఆర్‌, పోలీసు ఉన్నతాధికారులు స్పందించకపోవడం విచారకరమని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల నివారణ, శాంతి భద్రతలను పటిష్ఠ పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికైనా మహిళలపై జరుగుతున్న దాడులకు ఆయా నిపుణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని శారద హెచ్చరించారు.

మహిళలపై జరుగుతున్ననేరాలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : శారద

ABOUT THE AUTHOR

...view details