దేశ రాజధాని దిల్లీలో జరిగిన విధ్వంసకర ఘటనలు దురదృష్టకరమని ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఫ్రంట్ నేతలు అన్నారు. ఈ విషయంలో పోలీసుల చర్యలను వారు ఖండించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భాగ్యనగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు.
'దిల్లీలో హింసకు కారకులపై కఠిన చర్యలు చేపట్టాలి' - CAA Against Meeting
దిల్లీ హింసకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ నేతలు పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు.
BC sc st muslim front
సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీని ఉపసంహరించుకోవాలని తెలిపారు. దిల్లీలో చెలరేగిన హింసకు హోంశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :ఎంపీ వినోద్‌కు తుపాకీ ఎక్కుపెట్టిన పార్లమెంటు సిబ్బంది!